Sunday, January 19, 2025
HomeTrending NewsSupport to Babu: లోకేష్ కు తలైవా ఫోన్: రేపు బాబుతో పవన్ ములాఖత్

Support to Babu: లోకేష్ కు తలైవా ఫోన్: రేపు బాబుతో పవన్ ములాఖత్

సూపర్ స్టార్ రజనీకాంత్ కాసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఫోన్ లో పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో లోకేష్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. “నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష.  చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయన్ను ఏమీ చేయలేవు” అంటూ చెప్పినట్లు తెలిసింది.  తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరని, ఆయన చేసిన  చేసిన మంచి పనులు, ప్రజాసేవ ఆయన్ను బైటకు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. రేపు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో బాబును కలవనున్నారు.  అంతకుముందు నగరంలో బస చేసిన లోకేష్, ఇతర కుటుంబ సభ్యులను కూడా పవన్ కలుసుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్