దీపావళికి రజినీకాంత్ ‘పెద్దన్న’

తమిళంలో ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె అంటూ మాస్ యాక్షన్‌ను చూపించేందుకు రెడీ అయ్యారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు డబింగ్ హక్కులను ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం అన్నాచెల్లెళ్ల సంబంధం మీద తెరకెక్కుతుండటంతో పెద్దన్న అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలతో సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు మీద కత్తి పట్టుకుని రజనీకాంత్ తన మాస్ అవతరాన్ని చూపించారు. ఇందులో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ లు ఉన్నట్టు కనిపిస్తోంది. రజినీ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. నిన్న విడుదల చేసిన తమిళ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోయింది. ఇక తెలుగు టీజర్ అతి త్వరలో రాబోతోంది. రజనీకాంత్ సరసన నయన తారహీరోయిన్ గా నటిస్తోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. ఇమ్మాన్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. వెట్రి సినిమాటోగ్రాఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 4న దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో ‘పెద్దన్న’ రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *