గత ఆదివారం మృతి చెందిన సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు కుటుంబాని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. హైదరాబాద్ చేరుకున్న రాజ్ నాథ్ మరో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి ఎంపీ డా. కె లక్ష్మణ్ తో కలిసి జూబ్లీహిల్స్ లోని కృష్ణం రాజు నివాసానికి చేరుకొని ఆయన భార్య శ్యామలాదేవి, కుమార్తెలు, హీరో ప్రభాస్ లను పరామర్శించారు.
గతంలో వాజ్ పేయి కేబినేట్ లో రాజ్ నాథ్ సింగ్ మంత్రిగా పని చేశారు, అదే కేబినేట్ లో కృష్ణంరాజు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని రాజ్ నాథ్ గుర్తు చేసుకున్నారు. అనంతరం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కృష్ణం రాజు సంస్మరణ సభలో రాజ్ నాథ్ పాల్గొన్నారు.
Also Read : కృష్ణంరాజు చివరి చూపుకు నోచుకోలేకపోయా: లారెన్స్ ఎమోషన్