Saturday, June 13, 2026
Homeసినిమారామ్, బోయపాటి మూవీ షూట్ లో శ్రీలీల

రామ్, బోయపాటి మూవీ షూట్ లో శ్రీలీల

బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరో రామ్ కి జోడిగా టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈరోజు ఈ మూవీ షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది.

దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి శ్రీను, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular