Saturday, June 13, 2026
Homeసినిమా'కళ్యాణం కమనీయం' ట్రైలర్ రిలీజ్ చేసిన అనుష్క

‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ రిలీజ్ చేసిన అనుష్క

సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రంగా ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా “కళ్యాణం కమనీయం” సినిమా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే… శివ, శృతి ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు. శివకు ఉద్యోగం లేకపోవడం శృతికి ఇబ్బందిగా మారుతుంది. భార్యను సంతోషపెట్టేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు శివ. ఆ ప్రయత్నాలు ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లాయి. శివ ఉద్యోగం సంపాదించి శృతిని హ్యాపీగా ఉంచాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. శివకు ఉద్యోగం లేకపోవడం ఈ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది కూడా ఎమోషనల్ గా పిక్చరైజ్ చేశారు. ఇది ప్రతి భార్య కథ, ప్రతి భర్త కథ, ఇది ప్రతి పెళ్లి కథ అంటూ వేసిన క్యాప్షన్స్ స్టోరికి యాప్ట్ అనిపించాయి. మొత్తంగా అన్ని భావోద్వేగాలు ఉన్న ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “కళ్యాణం కమనీయం” చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular