Saturday, March 14, 2026
Homeసినిమా#BoyapatiRAPO మైసూర్ షెడ్యూల్ ప్రారంభం

#BoyapatiRAPO మైసూర్ షెడ్యూల్ ప్రారంభం

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న ‘#BoyapatiRAPO’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రబృందం ఈరోజు మైసూర్‌ లో చివరి షెడ్యూల్‌ ను ప్రారంభించింది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌ లో ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌ తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మైసూరు విమానాశ్రయంలో దిగిన రామ్, శ్రీలీల కాండీడ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ రామ్ ని రగ్డ్ లుక్‌ తో మాస్ క్యారెక్టర్‌ లో ప్రెజెంట్ చేసింది. ఫస్ట్ థండర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular