Saturday, July 27, 2024
Homeసినిమాఈ స్థాయిలో ఉండడానికి కారణం అభిమానులే - రామ్ చరణ్‌

ఈ స్థాయిలో ఉండడానికి కారణం అభిమానులే – రామ్ చరణ్‌

రామ్ చ‌ర‌ణ్ త‌న అభిమానుల‌ను క‌లుసుకోవ‌టానికి ఎప్పుడూ ఆస‌క్తి చూపిస్తుంటారు. ప్ర‌త్యేక‌ సంద‌ర్భాల్లో చ‌ర‌ణ్‌ను క‌లుసుకుని మాట్లాడిన‌ప్పుడు ఆయ‌న అభిమానులు సైతం ఊహ‌ల్లో తేలిపోతుంటారు. వారి ఆనందాన్ని వెల‌క‌ట్ట‌లేం. ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్‌స్టార్ యు.ఎస్‌.ఎలో ఆస్కార్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అంత బిజీ షెడ్యూల్‌లోనూ రామ్ చ‌ర‌ణ్‌ లాస్ ఏంజిల్స్‌లో త‌న అభిమానుల‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. త‌న పై అంత‌ర్జాతీయ స్థాయిలో ఉన్న అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాల‌ను ప్రత్య‌క్షంగా ఫీల్ అయ్యారు.

అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల్లోని అభిమానులు ఈ నెల 11న లాస్ ఏంజిల్స్‌లో జ‌రిగిన ఫ్యాన్స్ మీట్ గ్రీట్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అమెరికాలోని ప‌లు ఫ్యాన్స్ గ్రూప్స్ ఆధ్వ‌ర్యంలో లాస్ ఫెలిజ్ బ్లెవ్డ్ వేదిక‌గా ఈ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ జ‌రిగింది. పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ పూర్ణకుంభంతో అమెరికాలోని మెగా అభిమానుల సంఘాల ప్రతినిధులు రాంచరణ్ ను వేదిక పై ఆహ్వానించారు. అభిమానుల ఆనందం, వారు రిసీవ్ చేసుకున్న తీరు, ప్రేమాభిమానాలు, ఆద‌ర‌ణ ఓ పాజిటివ్ వైబ్రేష‌న్స్‌ను క్రియేట్ చేశాయి. ఇదే ఈవెంట్‌లో అభిమానులు త‌మ హీరోతో మాట్లాడే అవ‌కాశం ద‌క్కింది. అంతే కాకుండా ఆయ‌న‌తో క‌లిసి వారంద‌రూ ఫొటోలు దిగారు. ఎంతో ఇష్ట‌ప‌డే హీరోని ద‌గ్గ‌ర‌గా చూసిన‌ప్పుడు క‌లిసిన‌ప్పుడు వారిలో ఎమోష‌నల్ లెవ‌ల్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ సందర్బంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ… ఇండియాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం సులభంగా ఉంటుంది కానీ అమెరికాలో ఎంత కష్టమో నాకు తెలుసు. నా మీదున్న అభిమానంతో అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి విమానాలు, కార్లలో ఇలా చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కిడికి వచ్చిన అభిమానులు అందరికీ కృతజ్ఞత చెప్పడం చాలా చిన్నది అవుతుంది అన్నారు చరణ్‌. అంతే కాకుండా… మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటా. ఇలా అభిమానించే వాళ్లను కలిసినప్పుడు మాలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ వేదిక ఇంత మంది అభిమానులను కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వేదికను ఏర్పాటు చేసిన మెగా అభిమానులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ అభిమానం చూస్తే సినిమాల్లో ఇంకేదో చేసి మిమ్మల్ని మెప్పించాలనే కసి పడుతుంది. మీ ఆధారాభిమానాల వల్లే ఈ స్థాయిలో ఉన్నాను అని చరణ్‌ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్