మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ న‌టిస్తుంది. అయితే.. ఈ మూవీని 2021 సెప్టెంబ‌ర్ లో చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అఫిషియ‌ల్ గా ఎలాంటి అప్ డేట్ రిలీజ్ చేయ‌లేదు మేక‌ర్స్.

దీంతో మెగా అభిమానులు అప్ డేట్ ఎప్పుడంటూ  సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. దీనిని సీరియ‌స్ గా తీసుకున్న మేక‌ర్స్ ఆగ‌ష్టు 15న ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆ రోజున టైటిల్ కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

ఈ మూవీ క‌థ విష‌యానికి వ‌స్తే.. ఒకే ఒక్క‌డు సినిమాలాగా  చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని తెలిసింది. ఇందులో చ‌ర‌ణ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత నార్త్ లో చ‌ర‌ణ్ కు బాగా క్రేజ్ పెర‌గ‌డంతో ఈ మూవీకి నార్త్ లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని.. అక్క‌డ కూడా భారీ స్థాయిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తుంది. వ‌చ్చే స‌మ్మ‌ర్ లో ఈ భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానుంది.

Also Read చ‌ర‌ణ్, శంక‌ర్ మూవీలో మరో గెస్ట్ ఆర్టిస్ట్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *