Sunday, January 19, 2025
Homeసినిమారాజ‌మండ్రిలో రామ్ చ‌ర‌ణ్‌

రాజ‌మండ్రిలో రామ్ చ‌ర‌ణ్‌

Mega Schedule: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, గ్రేట్ డైరెక్ట‌ర్ శంకర కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్‌తో ఓ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమా కాగా, దిల్ రాజు 50వ చిత్రం కావ‌డం విశేషం. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అగ్ర నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌, చెన్నై, పూణే వంటి ప్రాంతాల్లో సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది.

ఈ పాన్ ఇండియా మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ తూర్పు గోదావ‌రి జిల్లా ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. దోస‌కాయ‌ల ప‌ల్లి స‌హా ప‌లు చోట్ల శంక‌ర్ అండ్ టీమ్ లొకేష‌న్స్ వేట‌ను పూర్తి చేశారు. డీఐజీ ప‌ర్మిష‌న్‌కు అనుమ‌తి ప‌త్రం కూడా పెట్టుకున్నారు. రాజ‌మండ్రి, కాకినాడు, కొవ్వూరు ప‌రిసరాల్లో ఫిబ్ర‌వ‌రి 10 నుంచి 28 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు షూటింగ్ చేసుకుంటామ‌ని, షూటింగ్ స‌జావుగా సాగ‌డానికి ఓ ఎస్ఐ, 20 మంది కానిస్టేబుల్స్‌ తో బందోబ‌స్త్‌ ఏర్పాటు చేయాల‌ని నిర్మాత‌లు కోరారు. ఇప్పుడు స‌ద‌రు ప‌ర్మిష‌న్ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో ఆ ఫొటోలు తెగ వైర‌ల్ అవుతోంది.

కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ భారీ పాన్ ఇండియా మూవీని విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు ఇప్ప‌టికే దిల్ రాజు ప్ర‌క‌టించారు. ఆర్ఆర్ఆర్‌, ఆచార్య చిత్రాల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ హీరోగా నటిస్తోన్న చిత్ర‌మిదే.

Also Read : చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్