Thursday, May 9, 2024
Homeస్పోర్ట్స్వాళ్ళిద్దరూ రంజీ ఆడొచ్చు : గంగూలీ సలహా

వాళ్ళిద్దరూ రంజీ ఆడొచ్చు : గంగూలీ సలహా

Go Bak to Ranji: టీమిండియా టెస్ట్ ప్లేయర్లు అజింక్యా రేహానే, చతేశ్వర్ పుజారాలు రంజీ ట్రోఫీ ఆడాలని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సలహా ఇచ్చాడు. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడిన తరువాత మళ్ళీ రంజీ ట్రోఫీ ఆడటానికి సంశయించాల్సిన అవసరం లేదని, తమ ఆట తీరుగు మెరుగుపరచుకొని,  తామెంటో నిరూపించుకునేందుకు ఈ దేశవాళీ క్రికెట్ వారిరువురికీ తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు.

రేహానే, పుజారా ద్వయం గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్  సిరీస్ లో కూడా ఈ ఇద్దరూ నిరాశ పరిచారు. ఆ తర్వాత జరిగిన స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా టూర్ లో కూడా నిరాశపరిచారు. మాజీ క్రికెటర్లు, సీనియర్లు ఈ జోడీపై విమర్శలు చేసున్నారు, వీరిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇవాలని, తద్వారా టీమ్ ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు…ఈ వ్యాఖ్యలపై గంగూలీ స్పందించాడు.

‘వారు నిజంగా మంచి ఆటగాళ్లే, అందులో ఎలాంటి సందేహం లేదు, అయితే వారు మళ్ళీ దేశవాళీ క్రికెట్ ఆడి తమ ఆట తీరుకు పదును పెట్టుకోవాల్సిన సమయం ఆసంనమైంది. వారు మళ్ళీ రంజీలు ఆడటానికి చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ గంగూలీ వ్యాఖ్యానించాడు.

“రంజీ ట్రోఫీ చాలా పెద్ద టోర్నమెంట్, మేము కూడా అక్కడ ఆడే వచ్చాం, వీరిద్దరూ కూడా అక్కడ ఆడి వచ్చినవాళ్ళే, అందులోనూ వీరు కేవలం టెస్టు ప్లేయర్లుగానే ఉన్నారు, వైట్ బాల్ క్రికెట్ ఆడడం లేదు… అలాంటప్పుడు మళ్ళీ రంజీ ట్రోఫీ ఆడి సత్తా నిరూపించుకోవడంలో తప్పేమీ లేదు’ అన్నాడు గంగూలీ.

2020 డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రెహానే చివరిసారిగా సెంచరీ  చేశాడు, ఆ తర్వాత భారీ స్కోరు అతనికి లేదు. పుజారా అయితే మూడేళ్ళుగా ఒక్క సెంచరీ కూడా లేదు. 2019, జనవరిలో ఆస్ట్రేలియాతో  సిడ్నీ టెస్టులో చివరి సెంచరీ నమోదు చేశాడు.  ఈ నేపథ్యంలో గంగూలీ ఇలాంటి సలహా ఇచ్చాడు. మరి ఈ జోడీ ఏమి చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్