రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్న చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. ఇటీవల హైదరాబాద్, కర్నూలులో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చరణ్‌ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడం.. అది కూడా శంకర్ తో చేస్తున్న సినిమా కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే.. చరణ్‌, శంకర్ మధ్య గ్యాప్ వచ్చిందా అనగానే వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అనుకుంటే.. పొరపాటే. విషయం ఏంటంటే.. శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న షూటింగ్ కి చరణ్‌ గ్యాప్ ఇవ్వాలి అనుకోవడం లేదు కానీ.. ఒక నెల రోజులు గ్యాప్ వచ్చిందట. కారణం ఏంటంటే… ఓ నెల రోజుల పాటు శంకర్ కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు. ఈసారి ఏకంగా నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీంతో చరణ్‌ కి గ్యాప్ వచ్చింది. షెడ్యూల్ పూర్తయిన తర్వాత తిరిగి చరణ్‌, శంకర్ సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారం.

ఇలా షూటింగ్ కి గ్యాప్ రావడంతో చరణ్‌ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు బుచ్చిబాబుతో చేయాల్సిన సినిమాకు సంబంధించి కథా చర్చల్లో కూడా పాల్గొంటారని తెలిసింది. చరణ్‌ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అందుచేత.. భార్య ఉపాసనతో క్వాలిటీ టైమ్ గడిపే అవకాశం కూడా చరణ్ కు దక్కింది. శంకర్, బుచ్చిబాబు సినిమాల  తర్వాత కన్నడ డైరెక్టర్ నర్తన్ తో మూవీ చేయాలి అనుకుంటున్నారని సమాచారం. మొత్తానికి చరణ్‌ ప్లానింగ్ బాగానే ఉంది. మరి.. ఈ చిత్రాలతో ఏ స్థాయి విజయాలు సాధిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *