Saturday, May 11, 2024
Homeస్పోర్ట్స్Women's T20 WC: ఐర్లాండ్ పై విండీస్ విజయం

Women’s T20 WC: ఐర్లాండ్ పై విండీస్ విజయం

మహిళల టి 20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తొలి విజయం అందుకుంది.  ఐర్లాండ్ పై 6వికెట్లతో గెలుపొందింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ 66 పరుగులతో (53బంతులు;  8ఫోర్లు, 1సిక్సర్ ) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకుంది.

కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఒక్క పరుగు వద్ద తొలి వికెట్ (ఆర్మీ హంటర్-1) కోల్పోయినా  రెండో వికెట్ కు గ్యాబీ లూయీస్-ఓర్లా పెండర్ గాస్ట్ లు 90  పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు.  పెండర్ గాస్ట్ 47 బంతుల్లో  6ఫోర్లు,  1సిక్సర్ తో 61; గ్యాబీ 34 పరుగులు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి  137 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో షమిల్లా కొన్నెల్ 3; రాం హెరాక్; అఫీ ఫ్లేచెర్ చెరో 2; హేలీ మాథ్యూస్ ఒక వికెట్ సాధించారు.

లక్ష్య ఛేదనలో విండీస్ 48 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. రాషడ విలియమ్స్-17, షమైన్ క్యాంప్ బెల్లె-8 రన్స్ చేసి ఔటయ్యారు. మూడో వికెట్ కు హేలీ-హెన్రీ లు 74 పరుగుల పార్టనర్ షిప్ సాధించారు.  హేలీ-66; హెన్రీ-34 రన్స్ చేశారు. 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విండీస్ చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్