తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపటిందని ప్రసాద్ ఐ మ్యాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అయన కార్యాలయంలో రమేష్ ప్రసాద్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నతెలుగు చలనచిత్ర రంగానికి అండగా నిలిచారని ప్రశంసించారు.
లాక్ డౌన్ తో షూటింగ్ లు లేక, సుమారు ఏడాది పాటు థియేటర్ లు మూతబడి చిత్ర పరిశ్రమలోని వేలాది మంది అనేక ఇబ్బందుకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రంగం పై ఆధారపడిన వారందరిలో మనోధైర్యాన్ని ఇచ్చిందన్నారూ. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. చలన చిత్ర పరిశ్రమలోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని ముఖ్యమంత్రి KCR దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి