‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బాహుబలి’ రికార్డులు బద్దలే: రానా

ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్‌-కె’. భారీ తారాగణంతో, అత్యంత భారీ ఖర్చుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకు దగ్గట్లుగానే ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు.. ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి.. ‘ప్రాజెక్ట్-కె’పై ప్రశంసలు కురిపించాడు.

రానా మాట్లాడుతూ.. ‘ప్రాజెక్ట్‌-కె’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది’’ అని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్‌ చేస్తుందని చెప్పారు.‘‘భారతీయ చిత్రాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి. అలాగే మంచి కథతో వచ్చిన సినిమాకు ఎక్కడైనా ఆదరణ దక్కుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్-కె సినిమాలో అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొణె తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో కమలహాసన్‌ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *