Saturday, January 18, 2025
Homeసినిమాసూప‌ర్ కాంబినేష‌న్ సెట్ చేసిన రానా..?

సూప‌ర్ కాంబినేష‌న్ సెట్ చేసిన రానా..?

త‌మిళ హీరో శింబు,  డైరెక్ట‌ర్ వెంకట్ ప్రభు కాంబినేష‌న్లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మానాడు‘. ఈ మూవీ తమిళ నాట సంచలన విజయాన్ని అందించడమే కాకుండా శింబు కెరీర్ ని మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఈ స్టోరీని ముందు వెంకట్ ప్రభు మన తెలుగు హీరోలకు వినిపించాడని… ఎంత మందికి చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. మానాడు బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన త‌ర్వాత తెలుగులో రీమేక్ చేసేందుకు మేక‌ర్స్ పోటీప‌డ్డారు.

నాగచైతన్య హీరోగా మానాడు రీమేక్ రానున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి కానీ.. నాగ‌చైత‌న్య వెంక‌ట్ ప్ర‌భుతో మానాడు రీమేక్ కాకుండా స్ట్రైయిట్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి హీరో రానా సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ మూవీలో రానా నటించడం లేదట. సూప‌ర్ కాంబినేషన్ ని రానా సెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే… రానా ఏషియన్ సునీల్ నారంగ్ కలిసి ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెలుగు స్టోరీలో మార్పులు చేర్పులు చేస్తుండగా.. శౌర్య తర్వాత‌ 7 ఏళ్లుగా సినిమాలకు దూరంగా వుంటున్న దశరథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నారని స‌మాచారం. ఇక హీరోలుగా మాస్ మహారాజా రవితేజని డీజే టిల్లు సిద్దూ జొన్నలగడ్డని సెట్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మ‌రి.. ఈ మూవీ ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్