Friday, June 12, 2026
Homeసినిమాహరీష్ శంకర్ చేతుల మీదుగా 'రణస్థలి' ట్రైలర్

హరీష్ శంకర్ చేతుల మీదుగా ‘రణస్థలి’ ట్రైలర్

ధర్మ, బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకం పై ధర్మ, చాందిని రావు, ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం ‘రణస్థలి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26 న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా ‘రణస్థలి’ ట్రైలర్ ను విడుదల చేశారు.

డీఫ్రెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రణస్థలి ట్రైలర్ చూస్తుంటే.. కె. జి. యఫ్, కాంతారా సినిమాలు ప్రేక్షకులకు ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో అలాంటి వైబ్రేషన్ ఈ రణస్థలిలో కనిపిస్తుంది. పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, డైలాగులు ఇలా అన్నీ ఎలిమెంట్స్ వున్న సినిమా  ప్రేక్షకులను అలరిస్తుందని దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular