Friday, June 12, 2026
Homeసినిమాడిసెంబర్ 9న వర్మ 'డేంజరస్' విడుదల

డిసెంబర్ 9న వర్మ ‘డేంజరస్’ విడుదల

కంపెనీ పతాకంపై రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్వకత్వంలో రూపొందించిన తాజా సినిమా “డేంజరస్”. దీనికి “మా ఇష్టం” అన్నది ఉపశీర్షిక. అందాల తారలు నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్లుగా నటించగా, ముఖ్య పాత్రలలో రాజ్ పాల్ యాదవ్, మిథున్ పురంధర్ కనిపిస్తారు. తెలుగు, హిందీ, తమిళ భాషలకు సంబందించిన ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.

అనంతరం వర్మ మాట్లాడుతూ మూడు భాషల్లో డిసెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. “నా సినిమాలలో మరో కొత్త కోణం ఈ సినిమా. హీరో, హీరోయిన్లతో వేలాది సినిమాలు వచ్చాయి. దానికి భిన్నంగా ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ కథతో దీనిని మలిచాం. మగవాళ్ళతో వారిద్దరు ఎలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారన్న నేపథ్యంలో రొమాంటిక్, క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో సాగే సినిమా ఇది. హీరోల డేట్స్ దొరక్కపోయినా హీరోయిన్స్ తో కూడా సినిమాలు చేయవచ్చునని చెప్పేవిధంగా ఈ సినిమా ఉంటుంది” అన్నారు.

నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదలను తాను అడ్డుకున్న మాట వాస్తవమేనని, కానీ వర్మకు, తనకు మధ్య అరమరికలు అన్నీ తొలగిపోవడంతో ఇక పై ఇద్దరం కలసి సినిమాలు చేయదలచుకున్నామని, రొమాన్స్ మాత్రమే కాదని, మంచి కంటెంట్ తో ఆసక్తిదాయకంగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular