Thursday, March 28, 2024
Homeసినిమాఎన్టీఆర్, కొర‌టాల మూవీలో శ్రీవల్లి?

ఎన్టీఆర్, కొర‌టాల మూవీలో శ్రీవల్లి?

ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని యంగ్ టైగ‌ర్ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని స‌మాచారం.

ఈ సినిమాలో అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ మూవీ కోసం త‌న‌ని ఎవ‌రూ కాంటాక్ట్ చేయ‌లేద‌ని జాన్వీ క‌పూర్ క్లారిటీ ఇచ్చింది. ఆత‌ర్వాత ఎన్టీఆర్ మూవీలో స‌మంత అంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో తేడాలు వ‌చ్చాయ‌ని.. స‌మంత భారీ రెమ్యూన‌రేష‌న్ అడ‌గ‌డం.. ఈ మూవీ మేక‌ర్స్ నో చెప్పార‌ని టాక్ వ‌చ్చింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..  పుష్ప మూవీలో శ్రీవ‌ల్లి పాత్ర‌లో మెప్పించిన ర‌ష్మికను క‌న్ ఫ‌ర్మ్ చేశార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే కొర‌టాల ర‌ష్మిక‌కు క‌థ చెప్పార‌ని.. ఆమె కూడా ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న‌ది వాస్త‌వ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

Also Read: పుష్ప 2 అప్ డేట్ ఇచ్చిన ర‌ష్మి

RELATED ARTICLES

Most Popular

న్యూస్