Wednesday, May 8, 2024
HomeసినిమాSushanth: 'రావణాసుర' చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది : సుశాంత్

Sushanth: ‘రావణాసుర’ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది : సుశాంత్

మాస్ మహారాజా రవితేజ, అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘రావణాసుర’.  సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. ఈహర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో సుశాంత్ చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..

రావణాసుర టైటిల్ రోల్ రవితేజ గారు చేస్తున్నారు.ట్రైలర్ చూస్తే గ్రే షేడ్స్ అందరికీ వున్నాయి. ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే ట్యాగ్ లైన్ వుంది. అయితే.. ఇందులో రాముడు ఎవరో.. రావణాసురుడు ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇది చాలా ఎక్సయిటింగ్ థ్రిల్లర్. కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. ట్రీట్ మెంట్ కొత్తగా వుంటుంది. అభిషేక్ గారు ఫోన్ చేసినపుడు.. ఒక కథ రెడీ చేసి సినిమా చేయాలనే ఆలోచనలో వున్నాను. అభిషేక్ గారికి కూడా అదే చెప్పాను కానీ.. కథ విన్నపుడు మాత్రం చాలా ఎక్సయిటింగా అనిపించింది.రవితేజ గారిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఒక ప్రేక్షకుడిగా నాకు చాలా కొత్తగా అనిపించింది. నా పాత్ర చాలా కీలకంగా వుంది. సినిమా అంతా వుంటుంది. దీనికి మరో డైమెన్షన్ తోడైతే బావుంటుదని చెప్పాను.

Ravi Teja Mark Ravanasura

సుధీర్ వర్మ గారికి కూడా అది నచ్చి చాలా ఫాస్ట్ గా వర్క్ చేసి నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా ఆ డైమెన్షన్ ని తీసుకొచ్చారు. మరో లేయర్ యాడ్ అయ్యింది. రవితేజ గారికి కూడా ఇది చాలా నచ్చింది. నేను అనుకున్న దాని కంటే చాలా బాగా వచ్చింది. రవితేజ గారితో చేసిన సీన్స్ ఖచ్చితంగా థియేటర్లో చాలా ఆసక్తికరంగా వుంటాయి.

అక్కినేని కుటుంబం నుంచి రావడం నా అదృష్టం. అయితే నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న అవకాశాలతోనే ముందుకు వెళ్లాను. కొన్ని సినిమాలు ఆలస్యం కావడం, అనుకున్న సమయానికి రాకపోవడం ..ఇలా నా చేతుల్లో లేనివి కూడా కొన్ని జరిగాయి. ఇంత గ్యాప్ ఎందుకు వస్తుందని కొన్ని సార్లు నాకే తెలియలేదు. అయితే.. ఇంత గ్యాప్ వచ్చిన నా మైండ్ లో ఎప్పుడూ నెక్స్ట్ సినిమా చేస్తున్నామనే స్ఫూర్తి వుండేది. చిలసౌ తర్వాత ఇక గ్యాప్ తీసుకోకూడదని బలంగా నిర్ణయించుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది. దీంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది. అయితే.. గత ఆరు నెలలుగా చాలా బిజీగా వున్నాను.

‘అల వైకుంఠపురములో’ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. నార్త్ లో కూడా ఫేం తీసుకొచ్చింది.  ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. అయితే నేను అన్నీ చేయలేదు. రావణాసుర, భోళా శంకర్.. ఇలా ఎక్సయిట్ చేసిన సినిమాలు మాత్రమే చేశా. ప్రస్తుతం సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను. ఇంకొన్ని కథలు వింటున్నా. సోలో హీరో గా ఈ ఏడాది ఒక సినిమా వుంటుంది” అంటూ విశేషాలు వెల్లడించారు.

Also Read : Ravanasura: గ్రేట్ ఎక్స్ పీరియన్స్: హర్షవర్థన్ రామేశ్వర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్