7.2 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeTrending NewsSSC paper leak: పదో తరగతి తెలుగు పేపర్ లీక్

SSC paper leak: పదో తరగతి తెలుగు పేపర్ లీక్

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే లీకేజ్ అవడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూర్‌‌లో పరీక్ష మొదలైన ఏడు నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సప్‌ గ్రూప్‌లలో చెక్కర్లు కొట్టింది. పేపర్ లీక్ విషయం తెలిసిన వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మొదట పేపర్ లీక్ కాలేదంటూ విద్యాశాఖ అధికారులు చెప్పుకొచ్చారు. పేపర్ లీకేజ్ వార్తలను పోలీసులు నిర్ధారించారు.  తాండూరు ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్లో పేపర్ లీకేజ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్‌కు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప ఫోన్ నుంచి వాట్సప్‌లో షేర్ అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఉపాధ్యాయుడు బందెప్ప పోలీసుల అదుపులో ఉన్నారు. పేపర్ లీకేజ్‌పై బందెప్పను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also Read :

ప్రశ్నకొక రేటు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్