Friday, June 12, 2026
Homeసినిమా100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేందుకు రెడీగా రవితేజ!

100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేందుకు రెడీగా రవితేజ!

రవితేజ దూకుడు గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. ఏడాదికి మూడు సినిమాలైనా తన నుంచి వెళ్లాలనే ఒక లక్ష్యంతో ఆయన ముందుకు వెళుతూ ఉంటాడు. ఆయన టార్గెట్ తప్పిన సందర్భాలు తక్కువే. అలా ఈ ఏడాది కూడా ఆయన తన నుంచి మూడు సినిమాలు వదిలాడు. ఆ జాబితాలో ‘ఖిలాడి’ .. ‘రామారావు ఆన్ డ్యూటీ’ .. ‘ధమాకా‘ సినిమాలు కనిపిస్తాయి. ఈ మూడు సినిమాలు కూడా రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినవే.

అయితే కథలో అన్ని పాళ్లు కుదిరితేనే అది అన్ని వర్గాల ప్రేక్షకులను పట్టుకుంటుంది .. ఆకట్టుకుంటుంది. అలా మాస్ కంటెంట్ తో మనసులు దోచుకున్న చిత్రంగా ‘ధమాకా’ కనిపిస్తుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా,  క్రితం నెల 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. రోజుకి 10 కోట్లకి పైగా ఈ సినిమా వసూళ్ల జోరును చూపించింది. చాలా ఫాస్టుగా 50 కోట్ల మార్కును టచ్ చేసింది.

80 కోట్ల మార్కును టచ్ చేసిన దగ్గర నుంచి మాత్రం .. కాస్త ఊపు తగ్గింది. 89 కోట్లను అందుకున్న దగ్గర నుంచి రోజుకి రెండు కోట్లకి తక్కువ కాకుండా వసూళ్లను రాబడుతోంది. అలా ఈ సినిమా ఈ 13 రోజుల్లో 98 కోట్లను రాబట్టింది. ఈ రోజుతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం జరగొచ్చు. రవితేజ నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే మాటలు .. పాటలు .. డాన్సులు .. డైలాగులు .. ఫైట్లు సమపాళ్లలో కుదరటం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి హిట్ ను సొంతం చేసుకుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

Also Read : Dhamaka Review: మాస్ కంటెంట్ తో డబుల్ ‘ధమాకా’ చూపించిన రవితేజ! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular