Friday, June 12, 2026
Homeసినిమాఆసక్తిని రేపుతున్న 'కల్యాణం కమనీయం' ట్రైలర్!

ఆసక్తిని రేపుతున్న ‘కల్యాణం కమనీయం’ ట్రైలర్!

పెళ్లి అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని .. పెళ్లి తరువాత జీవితాన్ని కలర్ఫుల్ గా ఊహించుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి తరువాతనే ఒకరి లోపాలు ఒకరికి తెలుస్తుంటాయి .. బలహీనతలు బయటపడుతూ ఉంటాయి. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అలా పెళ్లి అనే బలమైన అంశం చుట్టూ అల్లుకున్న కథనే ‘కల్యాణం కమనీయం’.

సంతోష్ శోభన్ .. ప్రియభవాని శంకర్ జంటగా నటించిన ఈ సినిమా, యూవీ బ్యానర్ పై రెడీ అయింది. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం అనుష్క చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ప్రధానమైన పాత్రలను టచ్ చేస్తూ, లవ్ .. కామెడీ .. ఎమోషన్ ఈ సినిమాలో ఉన్నాయనే విషయాన్ని ట్రైలర్ ద్వారా చెప్పేశారు.

ఉద్యోగం చేసే భార్య … కోరినవి అందించే మావగారు. దాంతో హీరోగారు బద్ధకంగా రోజులు గడిపేస్తూ ఉంటాడు.  ‘నా భర్త ఉద్యోగం చేయవలసిందే’ అని ఒక రోజున హీరోయిన్ చెప్పేస్తుంది. పాతికేళ్లుగా మీ నాన్నపై పడి బతికేశావ్ .. ఇకపై నా మీదపడి బతకడానికి ప్లాన్ చేయకు .. అది మాత్రం జరగనీయను” అంటూ తేల్చేస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడనేదే కథ. ట్రైలర్ తోనే విషయం మొత్తం చెప్పేశారు. ఇక రిజల్టు ఎలా ఉంటుందనేది 14వ తేదీన చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular