Friday, March 20, 2026
Homeసినిమారవితేజ చేతుల మీదుగా 'స్లమ్ డాగ్ హజ్బెండ్' సాంగ్

రవితేజ చేతుల మీదుగా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సాంగ్

సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్  ‘స్లమ్ డాగ్ హజ్బెండ్‘. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు.  బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. తాజాగా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’నుంచి బరాత్ సాంగ్ ను మాస్ రాజా రవితేజ విడుదల చేశారు. పాటలో చాలా జోష్ ఉందని, పాటతో పాటు సినిమా కూడా హిట్ అవ్వాలని మూవీ టీమ్ కు విషెస్ తెలిపారు.   పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా.. భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి పాడారు. బరాత్ సందడి, ఉత్సాహం అంతా ఈ పాటలో కనిపించింది.  సినిమా ఎంత మాస్ ఎంటర్ టైనర్ గా ఈ పాట ఉంటుందో తెలియజేస్తోంది.

Also Read : స్లమ్ డాగ్ హజ్బెండ్ మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన రానా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular