Friday, June 12, 2026
Homeసినిమార‌వితేజపై ఆచార్య ఎఫెక్ట్?

ర‌వితేజపై ఆచార్య ఎఫెక్ట్?

Mass Effect:  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ తెర‌కెక్కించిన భారీ చిత్రం ఆచార్య. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ ను తెచ్చుకుని ప్రేక్షకులను నిరాశపర్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆచార్య సినిమా ఎఫెక్ట్ మెగాస్టార్ తదుపరి సినిమా పై పడినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లో మెగా 154 చిత్రం ఒకటి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడ‌ని, ఆ పాత్ర కోసం రవితేజ ఏకంగా 16 కోట్లు పారితోషికం అడిగినట్లు కూడా వార్తలు వ‌చ్చాయి. అయితే… తాజాగా ఆచార్య ఎఫెక్ట్ వలన అంత బడ్జెట్ ను పెట్ట‌లేమ‌ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చెప్పింద‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

దీంతో రవితేజ ప్లేస్ లో యంగ్ హీరోను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాబీ కూడా సినిమాను తగిన బడ్జెట్ లోనే పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇది హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉన్న‌ది అనేది తెలియాల్సి వుంది.

Also Read : కొరటాల ఒక్కడిదేనా తప్పు? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular