Friday, January 24, 2025
HomeTrending News2K Ban: 2000 వేల రూపాయల నోటు రద్దు

2K Ban: 2000 వేల రూపాయల నోటు రద్దు

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.  దేశంలో అతిపెద్ద 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే, ఈనోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

 ఈ మేరకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది. అవి… 

మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు.

ఏ విత్ డ్రాకయినా, ఎంత డబ్బు ఇవ్వాలన్నా అందులో రూ. 2 వేల నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించిన ఆర్బీఐ

సెప్టెంబరు 30 లోగా ప్రజలు తమ దగ్గరున్న 2 వేల నోట్లను ఏ బ్యాంకులోనయినా డిపాజిట్ చేయొచ్చు

ఒక వ్యక్తి ఒక విడతలో గరిష్టంగా పది రూ. 2 వేల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు.

ఈ నెల 23 నుంచి రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉంది

మార్చుకోడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30

2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయిన రూ.2 వేల నోటు ముద్రణ

 “క్లీన్ నోట్ పాలసీ” లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్