Padma Shri For Handloom Skill :
బీరెన్ కుమార్ బసక్ కుటుంబం బలవంతపు పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి భారత్ కు 1960లో వలస వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, నదియా జిల్లా, ఫులియా పట్టణంలో స్థిరపడిపోయిన ఆ కుటుంబం నుంచి బసక్ నైపుణ్యం కలిగిన నేత కళాకారడిగా ఎదిగారు. గడిచిన 48 ఏళ్లుగా ఈ రంగంలో కళా నైపుణ్యం, అద్భుతమైన హస్తకళను అందించి దేశ అత్యున్నత పౌర పురస్కారంతో (పద్మశ్రీ అవార్డు) గౌరవించబడ్డాడు.
బసక్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. 13 ఏళ్ల వయస్సులో తన సోదరుడితో కలసి రోజూ కోల్‌కతాకు 85 కిమీ రైలులో ప్రయాణించి చీరల మూటలతో వీధుల్లో తిరుగుతూ అమ్మకాలు చేపట్టే వాడు. ఉత్పత్తి మరియు అమ్మకందారుడైన తాను ఒక్క రూపాయితో వృత్తిని ప్రారంభించి ఈ రోజు 5,000 మంది నేత కార్మికులతో ₹25 కోట్లు వార్షిక టర్నోవర్ ను సాధించాడు.
భారతదేశ చరిత్ర, సంస్కృతి సంబంధించిన విభిన్న అంశాలను తన చేనేత పనిలో జోడిస్థూ 2013లో జాతీయ అవార్డును పొందారు. ఆలాగే నేత చీరపై రామాయణాన్ని చిత్రించినందుకు UK ఆధారిత వరల్డ్ రికార్డ్ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ ను ఆలాగే పొడవైన చీరను నేసినందుకు గిన్నిస్ బుక్‌లో చోటు సాధించాడు.
ఇవి కూడా చదవండి: ఆమె ఒక తులసి వనం