Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై పెరిగిన సందడి!

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై పెరిగిన సందడి!

ఈ గురువారం రోజున ఓటీటీ సెంటర్స్ ను వరుస సినిమాలు పలకరించాయనే చెప్పాలి. రవితేజ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ ఈ రోజునే నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ వారు మరో తెలుగు సినిమాను బరిలోకి దింపారు. ఆ సినిమా పేరే ‘ఆయ్’. నార్నె నితిన్ హీరోగా పరిచయమైన సినిమా ఇది. ఆగస్టు 15న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా యూత్ ను బాగానే అలరించింది.

గోదావరి నేపథ్యంలో నడిచే కథ ఇది. కార్తీక్ .. హరి .. సుబ్బు ముగ్గురూ మంచి స్నేహితులు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో కార్తీక్ తన ఊరికి వచ్చేస్తాడు. ఆ సమయంలోనే అతను పల్లవిని చూడటం .. మనసు పారేసుకోవడం జరిగిపోతాయి. అయితే కార్తీక్ స్నేహితుడు సుబ్బూ కూడా పల్లవినే ప్రేమిస్తూ ఉంటాడు. ఇలా మొదలైన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎన్ని మలుపులు తీసుకుంటుందనేది కథ. కామెడీ టచ్ తో సాగే ఈ కంటెంట్ మంచి మార్కులు కొట్టే ఛాన్స్ ఉంది.

ఇక ఇదే రోజున ‘ఆహా’ ఓటీటీలో ‘ఆహా’ అనే సినిమా రావడం విశేషం. అయితే ఇది తెలుగు సినిమా కాదు .. మలయాళం నుంచి వచ్చిన అనువాదం. 2021 లో మలయాళంలో హిట్ కొట్టిన సినిమా ఇది. 1980లలో కేరళలో బాగా పాప్యులర్ అయిన ఆట ‘టగ్ ఆఫ్ వార్’. ఈ గేమ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఈ రోజు నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంద్రజిత్ సుకుమాన్ .. మనోజ్ .. అమిత్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, బిపిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం వహించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్