Sunday, September 8, 2024
HomeTrending Newsఎర్రజొన్న వ్యాపారులకు మంత్రి వేముల వార్నింగ్

ఎర్రజొన్న వ్యాపారులకు మంత్రి వేముల వార్నింగ్

ఎర్రజొన్న రైతులను నష్టపర్చే సీడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర రాకుండా సీడ్ వ్యాపారులు సిండికేట్ గా మారే ప్రయత్నాలు చేస్తున్నారని పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి స్పందించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫోన్ చేసి ఎర్రజొన్న రైతులు నష్టపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్కొండ,ఆర్మూర్,నిజామాబాద్ రూరల్ పరిధిలో అధిక విస్తీర్ణంలో రైతులు ఎర్రజొన్న పంట సాగు చేస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా చూడాలన్నారు.
ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, బై బ్యాక్ ఒప్పందం ప్రకారమే ఎర్రజొన్నలు కొనుగోలు చేసేలా గట్టి పర్యవేక్షణ జరపాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులతో తక్షణమే సమావేశమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. రైతులకు నష్టం కలిగించే సీడ్ వ్యాపారుల లైసెన్స్ లు రద్దు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్