Friday, November 22, 2024
HomeTrending Newsజలమయమైన సిరిసిల్ల

జలమయమైన సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణంలో వరద ఉదృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫిరెన్స్. వరద ప్రభావిత కాలనీలకు హైద్రాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం తరలింపు. వరద నీరు మల్లింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచన. మూడు రోజులుగా పడుతున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

సోమవారం రాత్రి నుంచి పడుతున్న కుండపోత వర్షానికి వరద ఉదృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు వచ్చిన విషయం తెల్సుకున్న మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు. సహాయక చర్యల కోసం హైద్రాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని తెలిపారు. రానున్న 48 గంటల పాటు వర్షపాతం ఉన్నందున వరద మల్లింపుకు అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రంగం సిద్ధంగా ఉందని మంత్రి భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్