Sunday, February 23, 2025
Homeసినిమాసూపర్ క్రైమ్ థ్రిల్లర్ రెక్కీ షూటింగ్ పూర్తి

సూపర్ క్రైమ్ థ్రిల్లర్ రెక్కీ షూటింగ్ పూర్తి

Rekky Movie Shooting Completed : 

స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్1 గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’… ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా… ఇప్పటి వరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ‘రెక్కీ’ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాంశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న ‘రెక్కీ’ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు.  నాగరాజు ఉండ్రమట్ట, భాషా, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున

Also Read : బాలీవుడ్ లో.. దూసుకెళుతున్న పుష్ప‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్