Tuesday, June 9, 2026
Homeసినిమాపంచనామ టీజర్ విడుద‌ల‌ చేసిన వినాయక్

పంచనామ టీజర్ విడుద‌ల‌ చేసిన వినాయక్

Panchanama:
త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ జాదవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్ష్మి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం ‘పంచ‌నామా’. ఈ చిత్రానికి సిగటాపు రమేష్ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హార్దిక్ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో న‌టించిన వెంప కాశీ పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ క్రియేషన్ చిత్ర యూనిట్.. మాస్ డైరెక్టర్  వి.వి వినాయక్ చేతుల మీదగా ‘పంచనామ’ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేయించారు.

వి.వి వినాయక్ మాట్లాడుతూ “వెంప కాశీ గారిని ఎన్నోసార్లు సినిమాలో నటించమని అడిగినా చెయ్యనన్న‌ వ్యక్తి ‘పంచనామ’ అనే సినిమాలో చేశారు అని వినగానే షాక్ కి గురయ్యాను. అసలు ఈ సినిమా ఎందుకు చెయ్యవలిసి వచ్చింది?  క్యారెక్టర్ ఏంటి? ఆ డైరెక్టర్ చెప్పిన విధానం ఏంటి? ఎలా ఒప్పించారు? అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అయితే.. ఆ క్యారెక్టర్ గురించి విన్న తరువాత అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని. ఈ సినిమా డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడుకి నా మనస్పూర్తిగా దీవెనలు తెలుపుతున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. కనుక ఆ పోస్టరే చెబుతుంది ఈ సినిమా ఎంత కసిగా చేశారని…. పంచనామ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు” అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ “వి.వి వినాయక్ గారు చాలా బిజీగా ఉన్నా కూడా ఆయన చేతులు మీదగా ఫస్ట్ లుక్ పోస్టర్, జర్ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనని నేను బ్రహ్మ అని పిలుచుకుంటాను. నాకు ఇష్టమైన డైరెక్టర్స్ లో అయన ఒకరు. ఆయన ఇచ్చిన దీవెనలు నాలో మరింత పాజిటివ్ ఎనర్జీ నింపాయి. వినాయక్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు” అన్నారు.

Also Read : ‘పరమహంస’గా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫస్ట్ లుక్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular