Friday, March 29, 2024
HomeTrending Newsరెబల్ స్టార్ కన్నుమూత

రెబల్ స్టార్ కన్నుమూత

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన నాటి ప్రధాని వాజ్ పేయి కేబినేట్ లో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారు. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

చిల‌కా గోరింక సినిమాతో కెరీర్ ప్రారంభించి దాదాపు 200 సినిమాల్లో న‌టించారు. ఆయ‌న న‌టించిన ఆఖ‌రి చిత్రం రాధేశ్యామ్. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త టాలీవుడ్ కి పెద్ద షాక్ అని చెప్ప‌చ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్