7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeసినిమాటిఎన్నార్ కు కరోనా!

టిఎన్నార్ కు కరోనా!

ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ టిఎన్ఆర్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఐసియూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఐ-డ్రీమ్స్ మీడియాలో సినిమా ఇంటర్వ్యూ ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. నటనపై ఆసక్తి పెంచుకున్న టిఎన్నార్ ఇటీవల కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు కూడా పోషిస్తున్నారు. అయన అసలు పేరు తుమ్మ నరసింహా రెడ్డి. టిఎన్నార్ గా తెలుగు సినిమా, యూట్యూబ్ ప్రేక్షకులకు సుపరిచితులు. సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే విధానం, అడిగే ప్రశ్నలతో అభిమానం సంపాదించుకున్నారు.

రెండ్రోజులుగా అయన పరిస్థితి ఆందోళనకరంగా వుందని తెలిసింది. క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్న టిఎన్నార్ ఆరోగ్యంపై పలువురు సినీ పెద్దలు ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి పరిస్థితి వాకబు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ అత్యంత విషమంగా వున్నట్లు వార్తలు వచ్చినా, సాయంత్రానికి వైద్యులు అందించిన సమాచారం ప్రకారం అయన డేంజర్ నుంచి బైట పడ్డారని, కోలుకుంటారని ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. అయన త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్