Sunday, April 14, 2024
Homeస్పోర్ట్స్కరోనాతో చేతన్ తండ్రి మృతి

కరోనాతో చేతన్ తండ్రి మృతి

ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిద్యం వహిస్తున్న పేసర్ చేతన్ సకారియా తండ్రి కంజిభాయి కోవిడ్ బారిన పడి మరణించారు.  గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ కు చెందిన  చేతన్ తన ఆట తీరుతో క్రీడాభిమానులను ఆకట్టుకున్నారు. 2021 ఐపిఎల్ లో ఏడు వికెట్లు తీసుకున్నారు.  తండ్రికి కరోనా సోకే సమయానికి బయో బబుల్ లో వున్న చేతన్ ఐ పిఎల్ నిరవధికంగా వాయిదా పడగానే తండ్రిని చూసేందుకు వెళ్లారు. పిపిఈ కిట్ ధరించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని పరామర్శించారు. పరిస్థితి విషమించడంతో కంజిభాయి ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. జనవరిలో చేతన్ తన సోదరుడిని కోల్పోయారు, ఆ సమయంలో  చేతన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నారు.

ఈ  కష్టకాలంలో  చేతన్ కు అండగా ఉంటామని, ఆ కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని రాజస్థాన్ రాయల్స్  మేనేజ్ మెంట్ వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్