Thursday, June 11, 2026
HomeTrending Newsరాజ్యసభ అభ్యర్ధులుగా రేణుకా చౌదరి, అనిల్ యాదవ్

రాజ్యసభ అభ్యర్ధులుగా రేణుకా చౌదరి, అనిల్ యాదవ్

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్ధులుగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో తెలంగాణ తో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, కర్ణాటక నుంచి మొత్తం ఆరుగురి పేర్లను ప్రకటించింది.

కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, డా. సయ్యద్ నసీర్ హాసన్, జి.సి చంద్ర శేఖర్ లను ఎంపిక చేయగా, మధ్య ప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను ప్రకటించింది.

కాగా ఈ ఉదయం నలురురి పేర్లతో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి డా. అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి డా. అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హందోర్ ల పేర్లు ప్రకటించగా, నేడు సోనియా రాజస్థాన్ రాజధాని జైపూర్ చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular