క్షత్రియ సేవా సమితి తెలుగు రాష్ట్రాల కార్యవర్గం నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.  ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపి, మెమెంటో అందజేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు జాతీయ స్ధాయిలో ప్రాధాన్యం కల్పించడంతో తాము అండగా ఉంటామని ముఖ్యమంత్రికి క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్‌ పేరిచర్ల నాగరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ వి.వెంకటేశ్వర రాజు, జాయింట్‌ సెక్రటరీ డివిఎస్‌ఎస్‌ఎన్‌.రాజు, ట్రెజరర్‌ పి.వెంకటేశ్వర రాజు, క్షత్రియ సేవా సమితి ఫెడరేషన్‌ చైర్మన్‌ సీహెచ్‌.వెంకటపతి రాజు, సెక్రటరీ డీఎస్‌ఎన్‌. రాజు, వైస్‌ చైర్మన్‌ ఆంజనేయ రాజు, గాదిరాజు సుబ్బరాజు తదితరులు ఉన్నారు.

Also Read : అల్లూరి స్పూర్తితో జగనన్న పాలన: మంత్రి రోజా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *