Sunday, June 14, 2026
HomeTrending Newsసిఎంకు ఎంపీడీవోల సంఘం కృతజ్ఞతలు

సిఎంకు ఎంపీడీవోల సంఘం కృతజ్ఞతలు

ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేశారు.   దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జీవీ.నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ కె.శ్రీనివాసరెడ్డి, కన్వీనర్‌ కేఎన్‌వీ.ప్రసాదరావు, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular