Friday, June 12, 2026
HomeTrending Newsరేవంత్ కే పిసిసి పీఠం

రేవంత్ కే పిసిసి పీఠం

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు అనుముల రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పదిమందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించింది.

కార్యనిర్వాహక అధ్యక్షులుగా మహమ్మద్ అజారుద్దీన్, డా. జే. గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి, బి. మహేష్ కుమార్ గౌడ్ లు నియమితులయ్యారు.

సీనియర్ ఉపాధ్యక్షులుగా సంబాని చంద్ర శేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోడెం వీరయ్య, సురేష్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, కుమార్ రావు, జావీద్ అమీర్ లను నియమించారు.

ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కి నియమితులయ్యారు. కన్వీనర్ గా సయ్యద్ అజమతుల్లా హుస్సేన్ ను నియమించారు. దామోదర్ రాజ నరసింహ ను ఎలక్షన్ మేనేజెమెంట్ కమిటీ చైర్మన్ గా నియమించారు. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీచైర్మన్ గా మహేశ్వర్ రెడ్డి నియమితులయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular