గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రపతికి, రాష్ట్రానికి వారధి గవర్నర్ అన్నారు. గవర్నర్ కి హైదరాబాద్ లో శాంతి భద్రతల బాధ్యత 2024 జూన్ వరకు సర్వాధికారాలు ఉన్నాయన్నారు. ఎంపీలను హౌస్ అరెస్ట్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు రేవంత్ రెడ్డి. గవర్నర్ తన అధికారాలు ఉపయోగించడం లేదని ఆరోపించారు. మాకు అన్యాయం జరిగినప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు గవర్నర్ కి ఈ ఇబ్బంది ఉండేది కాదన్నారు.
కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘన చేసినప్పుడు గవర్నర్ స్పందిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు గవర్నర్ వరకు సమస్య వచ్చింది కాబట్టి అందరూ తనకు అనుకూలంగా మాట్లాడాలి అనుకుంటున్నారని అన్నారు. తమిళనాడు నుండి వచ్చిన ఇద్దరు గవర్నర్ లు కెసిఆర్ కాంగ్రెస్ ని చంపుతున్నాడు కదా అని వదిలేశారని.. కానీ ఇప్పుడు కేసీఆర్ గవర్నర్ లనే ఇబ్బంది పెడుతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ లకు ఇప్పుడిప్పుడే కెసిఆర్ గురించి అర్థం అవుతుందన్నారు.
మరోవైపు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఈ రోజు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. మునుగోడు ఉపఎన్నికల తర్వాత నేతలు ఇద్దరు భేటి కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : బీఆర్ఎస్ తొలి సభ విఫలం – బండి సంజయ్