Tuesday, March 10, 2026
HomeTrending Newsజోడెద్దుల్లా పనిచేస్తాం: రేవంత్

జోడెద్దుల్లా పనిచేస్తాం: రేవంత్

పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. రేపటి ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు తుంగలో కలుస్తున్నాయని భట్టి ఆరోపించారు. సోనియాగాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టే తీసుకునే కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.

రెండు తరాలుగా భట్టి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని, కాంగ్రెస్ పార్టీ అంటే భట్టి విక్రమార్క అని రేవంత్ రెడ్డి అన్నారు. భట్టి మద్దతు, ఆలోచన విధానాలను తీసుకుంటూ ముందుకు వెళతానని రేవంత్ స్పష్టం చేశారు. సీఎల్పీ-టీపీసీసీ రెండు కళ్ళలాగా, జోడెద్దుల్లాగా కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఏ ఆకాంక్షలు నెరవేర్చడం కోసమైతే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో ఆ ఆశయాలను కేసిఆర్ తుంగలో తొక్కారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వేదికగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, మహిళల కోసం, ఉద్యమకారుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఇద్దరం సమన్వయంతో, సమిష్టిగా పనిచేస్తామన్నారు. పెద్దలందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని రేవంత్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular