Sunday, January 19, 2025
Homeసినిమాబ‌న్నీ, ప‌వ‌న్ గురించి వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బ‌న్నీ, ప‌వ‌న్ గురించి వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Again Started: వివాద‌స్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి గ‌తంలో కొన్ని కామెంట్స్ చేయ‌డం.. అప్ప‌ట్లో సంచ‌ల‌నం అవ్వ‌డం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి బ‌న్నీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి వ‌ర్మ చేసిన ట్వీట్స్ వార్త‌ల్లో నిలిచాయి. ఇంత‌కీ వ‌ర్మ ఏమ‌ని ట్వీట్ చేశారంటే…

“ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు… ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగుని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.  దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా మూవీగా తీసుకెళ్ళి మీరే సబ్ కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి. పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? .. పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము”

“ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు అని ఈ ట్విట్ట‌ర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ ఫలితం చూశారు… ఇప్పుడు మళ్లీ చెప్తున్నా.. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి.. పవర్ ప్రూవ్ చెయ్యండి” అని వ‌ర్మ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది. మ‌రి.. వ‌ర్మ ట్వీట్స్ గురించి ప‌వ‌ర్ స్టార్ కానీ.. భీమ్లా నాయ‌క్ ప్రొడ్యూస‌ర్స్ కానీ.. స్పందిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్