Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రాసకు అన్నప్రాసన

ప్రాసకు అన్నప్రాసన

Rhythm-Language: ఇటీవల వచ్చిన రెండు తెలుగు పాటలు ఎంత ముద్దొస్తున్నాయో? చక్కటి రచన. చిక్కటి సంగీతం. వీనులవిందయిన గానం. పాటకు ప్రాస ఎంత ప్రధానమో తెలియజెప్పే ఈ రెండు గీతాలను కోట్ల మంది విని తరిస్తున్నారు.

ఈ రెండు పాటల సంగీత, సాహిత్యాల గురించి…రచయిత ప్రాసలకు అన్నప్రాసన చేయించిన వైనం గురించి ఎవరయినా చేయి తిరిగిన రచయితలు రాస్తే బాగుంటుంది. ఈ పాటల మీద ఎంతో రాయాలని ఆసక్తి ఉన్నా…ఏమీ రాయలేకపోతున్న నా అశక్తతను అర్థం చేసుకోగలరు.

తెలుగు ఎప్పటికీ చచ్చిపోదు అని నమ్మకం కలిగించే ఈ పాటలను మీరు కూడా చదివి…నిలువెల్లా పొంగిపోండి. అక్షరదోషాలు ఉంటే నా అకౌంట్లో వేయండి. ఎందుకంటే మంత్రనగరుల్లో కంఠంలో పోసే నన్నారుల మంత్రాలు నా స్థాయికి అందవు గనుక.

రి ప్రాస గీతం
రచన:- అనంత్ శ్రీరామ్
సంగీతం:- మణిశర్మ
చిత్రం:- ఆచార్య

“నీలాంబరి…నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే…నీ అల్లరి…

వేరెవ్వరే నీలా మరి
అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరీ ….నీలాంబరి

వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీ దరి
నీలాంబరి …నీలాంబరి
మంత్రాలేంటోయ్ ఓ పూజారి
కాలం పోదా…చేజారి
తంత్రాలేవి రావే నారి
నేనేం చెయ్ నే…నన్నారి
నువ్వే చూపాలేమో…చిలిపి వలపు నగరి…

విడిచా…ఇపుడే
ప్రహరీ నిన్నే కోరి
గాలాలేయకోయ్…మాటల జాలరి
ఒళ్ళో వాలదా చేపల నా సిరి
నీతో సాగితే మాటలే ఆవిరి
అయినా వేసినా పాటతో పందిరి
అడుగేస్తే చేస్తా నీకే నౌకరి…

ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస
ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస
మెరిశా వలచే కలలో ఆరితేరి
ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి
నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి
విడనే వీడనే… నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నదీ జీవధారఝరి
ప్రతిజన్మ నీకే రాశా చాకిరీ”

తి ప్రాస గీతం
రచన:- అనంత్ శ్రీరామ్
సంగీతం:- తమన్
గానం:- సిధ్ శ్రీరామ్
చిత్రం:- సర్కారువారి పాట

వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు
మీదకి దూకినాయా ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా
తీగలు మోగినాయా పోయిందే  సోయా
ఇట్టాటివన్నీ అలవాటే లేదే
అట్టాటి నాకీ తడబాటసలేందే
గుండె దడగుందే పిడుగునందే జడిసిందే
నిను జత పడమని తెగ పిలిచినదే
కమాన్ కమాన్ కళావతి నువ్వే గతి నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి నువ్వులేకుంటే అధో గతి
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే బధ్నామి…. అన్యాయంగా మనసుని గెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగ ఘోరంగా నా కలల్ని కదిపావే దొంగా అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే
కళావతి కళావతి కల్లోలమైందే నా గతి
గులాబీ కళావతి కుళ్ళబొడిసింది చాలు తీ”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

తెలుగు పాటల తిక్క

RELATED ARTICLES

Most Popular

న్యూస్