Sunday, May 11, 2025
HomeTrending Newsఆగ్రాలో అంతర్జాతీయ వలసల సమావేశం 

ఆగ్రాలో అంతర్జాతీయ వలసల సమావేశం 

అంతర్జాతీయ వలసలపై  చురుకుగా పనిచేస్తున్న భారత్, నేపాల్ దేశాలలోని బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్  (బిడబ్ల్యుఐ) అనుబంధ సంఘాల ప్రతినిధులతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో రెండు రోజుల సమావేశం జరుగనున్నది. ఈనెల 22, 23 తేదీలలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ నుండి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి, జగిత్యాల జిల్లా దమ్మన్నపేట మాజీ సర్పంచ్ మిల్కూరి చంద్రయ్య లు హాజరవుతున్నారు.

వలస కార్మికుల హక్కులను నిలబెట్టుకోవడం (రక్షించుకోవడం) కోసం ప్రభుత్వ జోక్యాలు – కార్మిక సంఘాల ప్రమేయం అనే అంశంపై చర్చ జరుగుతుంది. గల్ఫ్ వలసలు, సమస్యలు, పరిష్కారాలు – ప్రభుత్వాల బాధ్యత, ఈ క్రమంలో కార్మిక సంఘాలు  ఏ విధంగా సహాయపడవచ్చు అనే కోణంలో భారత్, నేపాల్ ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్