Thursday, March 19, 2026
HomeTrending Newsత‌మిళ‌నాడులో రోడ్డు ప్ర‌మాదం...అయ్య‌ప్ప భ‌క్తుల మృతి

త‌మిళ‌నాడులో రోడ్డు ప్ర‌మాదం…అయ్య‌ప్ప భ‌క్తుల మృతి

త‌మిళ‌నాడులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో శ‌బ‌రిమ‌ల భ‌క్తులు మ‌ర‌ణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భ‌క్తులు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది అయ్య‌ప్ప భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇరైచలపాలం దగ్గరలోని కుములి ఘాట్ సెక్ష‌న్‌లో శుక్ర‌వారం రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అందిపట్టి సమీపంలోని షన్ముగసున్దరాపురం గ్రామానికి చెందిన భక్తులు…  శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో ద‌ర్శ‌నం చేసుకుని తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో పాటు మ‌రో ఏడేళ్ల బాలుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ ముగ్గుర్ని తేజి జిల్లా ఆస్ప‌త్రికి చికిత్స కోసం త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular