త‌మిళ‌నాడులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో శ‌బ‌రిమ‌ల భ‌క్తులు మ‌ర‌ణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భ‌క్తులు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది అయ్య‌ప్ప భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇరైచలపాలం దగ్గరలోని కుములి ఘాట్ సెక్ష‌న్‌లో శుక్ర‌వారం రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అందిపట్టి సమీపంలోని షన్ముగసున్దరాపురం గ్రామానికి చెందిన భక్తులు…  శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో ద‌ర్శ‌నం చేసుకుని తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో పాటు మ‌రో ఏడేళ్ల బాలుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ ముగ్గుర్ని తేజి జిల్లా ఆస్ప‌త్రికి చికిత్స కోసం త‌ర‌లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *