Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్రాయల్స్ ఓనర్ నన్ను కొట్టాడు: రాస్ టేలర్ ఆరోపణ

రాయల్స్ ఓనర్ నన్ను కొట్టాడు: రాస్ టేలర్ ఆరోపణ

తన ఆత్మ కథతో సంచలనాలు రేకెత్తిస్తున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ నేడు మరో తీవ్ర ఆరోపణ చేశాడు. 2011 ఐపీఎల్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ఓనర్ తనను చెంపపై నాలుగు సార్లు కొట్టాడని వెల్లడించాడు.

“ఆ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో మ్యాచ్… 195 పరుగుల లక్ష్యం బెంగుళూరు మా ముందుంచింది. ఆ మ్యాచ్ లో నేను ఎల్బీగా డకౌట్ అయ్యాను. రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోయింది. ఆ రాత్రి మేము బస చేస్తున్న హోటల్ పై ఫ్లోర్ లోని బార్ లో ఉన్నాం. ఆ సమయంలో ఒనర్లలో ఒకరు నా వద్దకు వచ్చి… నిన్ను మిలియన్ డాలర్లు పెట్టి కొన్నది డకౌట్ కావడానికి కాదు అంటూ తన చెంపపై నాలుగు సార్లు బాదారు.. అది కోపంగా కొట్టకపోయినా .. ఆ సంఘటన నన్నెంతో బాధించింది” అంటూ తన ఆత్మ కథ ‘రాస్ టేలర్: బ్లాక్ అండ్ వైట్’ లో వెల్లడించాడు.  ఈ ఘటన షేన్ వార్న్ సమక్షంలోనే జరిగిందని కూడా  చెప్పాడు.

దీనితో పాటుగా న్యూ జిలాండ్ టీం లో వర్ణ వివక్ష ఉందని, తెల్ల ఆటగాళ్ళు నల్లవారిని చులనకగా చూస్తారని కూడా  టేలర్ వెల్లడించాడు. ఎన్నో సార్లు తానూ డ్రెస్సింగ్ రూమ్ లో ఈ రకమైన వివక్ష అనుభవించానని  చెప్పారు.  రాస్ టేలర్ తల్లి సమోయన్ జాతికి చెందిన వారు.  న్యూ జిలాండ్ అటవీ ప్రాంతంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో వీరి జనాభా ఉంది.

కాగా, ఐపీఎల్ లోని ఓ టీమ్ ఓనర్ పై రాస్ టేలర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేకెత్తిస్తున్నాయి. ఐపీఎల్ లో ఆటగాళ్ళపై ఓనర్లు వ్యవహరించే తీరు చర్చనీయాంశమైంది.

Also Read : Women Cricket: ఇండియాకు రజతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్