Saturday, January 18, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్.. అంతకు మించి..

ఆర్ఆర్ఆర్.. అంతకు మించి..

RRR Glimpse Released Today :

ఆర్ఆర్ఆర్.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సంచలన చిత్రం. బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించి బాలీవుడ్ మాత్రమే కాదు.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో బాహుబలి రేంజ్ లో చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంచలన చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సరికొత్త గ్లింప్స్ ను అక్టోబర్ 29న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. పునీత్ రాజ్ కుమార్ మరణంతో వాయిదా వేశారు. అదే రోజున ముంబాయిలో ప్రెస్ మీట్ లో మీడియాకి చూపించినప్పుడు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు ఆర్ఆర్ఆర్ న్యూ  గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలోని సంఘటనలను పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 45 సెకన్ల  ఈ టీజర్ చూస్తుంటే.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పటి వరకు చెప్పింది తక్కువ. తీస్తోంది ఎక్కువ అన్నట్లు వుంది. ఇంకా చెప్పాలంటే.. మీరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి.. అన్నట్టుగా ఆర్ఆర్ఆర్ ఉంటుందని ఈ టీజర్ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.

ఓ భారీ స్వాంతంత్ర్య పోరాటాన్ని తెర పైకి తెచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. దీనికి స్వరవాణి కీరవాణి భీకరమైన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ అందించారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. మరి.. బాక్సాపీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ ఏ స్ధాయిలో చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.

Must Read : ఆర్ఆర్ఆర్.. ఐడీ కార్డ్ తో ఎన్టీఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్