Saturday, January 18, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్ సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

ఆర్ఆర్ఆర్ సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

RRR Second Single Will Be Released On 10th November :

సినీ ప్రియులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంచలన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ భారీ క్రేజీ మూవీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు.

ఈ సినిమా నుంచి రెండో పాటను ఈ నెల 10న విడుదల చేయనున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌ని బట్టి చూస్తుంటే.. ఈ పాట పూర్తి స్థాయి మాస్‌ బీట్‌ అనిపిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ పాట విడుదల చేయనున్నారు. నాటు నాటు అంటూ సాగే ఈ పాట హై వోల్టేజ్ డ్యాన్స్ నంబర్ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ హీరోలకు సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మాస్ స్టెప్పులు వేస్తూ కనిపిస్తున్నారు. అయితే.. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రధారులు ఇలాంటి కాస్ట్యూమ్స్ లో కనిపించడం అనేది ఆసక్తిగా మారింది. దీంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది.

Must Read : ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో వచ్చేస్తోంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్