Saturday, January 18, 2025
Homeసినిమాఇంతకీ సంక్రాంతికా? సమ్మర్ కా?

ఇంతకీ సంక్రాంతికా? సమ్మర్ కా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇంకా 40 రోజులకు పైగా షూటింగ్ చేయాల్సివుంది. ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం లేనందువల్ల  అందుచేత ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్త ఏంటంటే.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని 2022 సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్టుగా టీమ్ మెంబర్స్ కి చెప్పారట. అయితే.. ఎన్టీఆర్, చరణ్.. 2022 సమ్మర్ కి అంటే చాలా ఆలస్యం అవుతుందాని  సంక్రాంతికి అయితే బెటర్ అంటూ వాళ్ల ఆలోచనను చెప్పారట. ఒకవేళ ఎన్టీఆర్, చరణ్‌ చెప్పినట్టుగా సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఏర్పడడం ఖాయం. ఎందుకంటే.. ఆల్రెడీ 2022 సంక్రాంతికి మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాన్‌ హరి హర వీరమల్లు చిత్రాలను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

అయితే.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఆర్ఆర్ఆర్ నుంచి పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఆ సమయంలోనే సినిమా విడుదల తేదీని కూడా వెల్లడిస్తారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్