Sunday, January 19, 2025
Homeసినిమాఅక్టోబర్ 21న జ‌పాన్ లో ఆర్ఆర్ఆర్

అక్టోబర్ 21న జ‌పాన్ లో ఆర్ఆర్ఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి నుంచి వ‌చ్చిన  ఈ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇండియ‌న్ బాక్సాఫీస్ ని మ‌రోసారి ట్రిపుల్ ఆర్ తో షేక్ చేశాడు రాజ‌మౌళి.

ఇటీవ‌ల డిజిట‌ల్ లో రిలీజ్ చేస్తే.. అక్క‌డ కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ని ఆర్ఆర్ఆర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. రోజురోజుకు డిజిట‌ల్ లో ఆద‌ర‌ణ పెరుగుతుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీని జ‌పాన్ లో భారీ స్థాయిలో జ‌పాన్ లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

2022, అక్టోబర్ 21న  జపాన్ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జపాన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్